BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 06:04 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 06:04 PM
86 వీక్షణలు

అమరావతి:

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెలలోనే "తల్లికి వందనం", "అన్నదాత సుఖీభవ", "మత్స్యకారుల భరోసా" వంటి కీలక పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త పింఛన్ల మంజూరు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే చర్యలు చేపడుతోంది.

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయిని మరింత పెంచి, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అన్ని ఏర్పాట్లు పూర్తయితే జూలై నెల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.