BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి వ్యతిరేకంగా జూలై 22న దేశవ్యాప్త ఆందోళన: హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:57 PM
145 వీక్షణలు

అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి వ్యతిరేకంగా జూలై 22న దేశవ్యాప్త ఆందోళన: హరినాథ్

విస్సన్నపేట, జూలై 21: అమెరికాతో ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ ఒప్పందం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అలాంటి ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సంతకం చేయవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జూలై 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ధర్నా చౌక్‌లో ఉదయం 10 గంటలకు ధర్నా చేపడతామని చెప్పారు. గ్రామ గ్రామాన సంతకాల సేకరణ చేపట్టి, అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై సంతకం చేయవద్దని కోరుతూ భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు పంపుతున్నట్లు తెలిపారు.

జూలై 22న అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అలాగే జూలై 28, 29 తేదీల్లో ఢిల్లీలో రైతు, కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుందని వెల్లడించారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సీ2+50 శాతం ఆధారంగా కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమాటా, మామిడి, కోకో, రొయ్యల రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అప్పుల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, 60 సంవత్సరాలు దాటిన సన్నకారు, చిన్న, మధ్యతరగతి, కౌలు రైతులందరికీ నెలకు రూ.10,000 రైతు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై విస్తృత చర్చ జరిపి, రైతాంగ ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హరినాథ్ కోరారు.