BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను జెడ్పీ హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీల ఎంపికలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 07:53 PM
124 వీక్షణలు

పెనుగొలను జెడ్పీ హైస్కూల్లో అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీల ఎంపికలు

పెనుగొలను, జూలై 21: తిరువూరు నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్–2026 క్రీడా పోటీల ఎంపికలను గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సమక్షంలో డివిజనల్ విద్యాశాఖ అధికారి ఏ. శ్యాం సుందర్ రావు, నియోజకవర్గ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎం. రమేష్, పెనుగొలను వ్యాయామ ఉపాధ్యాయుడు హెచ్. అంజయ్యతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఎంపికలు 12 క్రీడాంశాల్లో నిర్వహించనున్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్, చెస్, యోగా, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ విభాగాల్లో అండర్–17, అండర్–23 బాలబాలికలకు విడివిడిగా ఎంపికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

ఆసక్తి గల అభ్యర్థులు "షాప్ విజయవాడ" వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, ఆన్‌లైన్ నమోదు ఫారం, అండర్–23 విభాగం అభ్యర్థులు పదో తరగతి మార్కుల మెమో జిరాక్స్ లేదా జనన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదు లేని వారికి ఎంపికల్లో పాల్గొనే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ఈ నెల 28న బాలికలకు, 29న బాలురకు క్రీడా పోటీల ఎంపికలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపు పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో హాజరుకావాలని కోరారు. పాల్గొనే వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తిరువూరు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.