BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏసీబీ వలలో డిప్యూటీ తహసిల్దార్.. రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:49 PM
125 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: జిల్లాలో మరోసారి అవినీతి రెవిన్యూ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రూ.20 వేల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

సమాచారం ప్రకారం, టెక్కినవారిగూడెంకు చెందిన రైతు పోతన సుకుమార్‌కు సంబంధించిన రెవిన్యూ పనిని పూర్తి చేయడానికి వెంకటేశ్వరరావు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రైతు పోతన సుకుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా పథకం ప్రకారం చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు, డిప్యూటీ తహసిల్దార్ వెంకటేశ్వరరావు రైతు నుంచి రూ.20 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి చర్యలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.