BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 02 July 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో డెంగ్యూ మాసోత్సవ ర్యాలీ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 08:49 PM
106 వీక్షణలు

తిరువూరు, జూలై 2: స్థానిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సి) ఆధ్వర్యంలో గురువారం డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు యూపీహెచ్సి ఇన్చార్జి వైద్యాధికారిణి డాక్టర్ జె. సాయి భవ్య సుధ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు నిల్వ నీటిలో ఎక్కువగా వృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కూలర్లు, పూల కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారానికి కనీసం ఒకసారి వాటిని శుభ్రపరచాలని సూచించారు.

డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, స్వీయ వైద్యం చేయకుండా వైద్యుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్.కె. బాబావలి, హెల్త్ సూపర్వైజర్ కె. రవి, హెల్త్ విజిటర్ శ్యామల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.