BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 May 2026, 05:42 pm
Posted by : V శ్రీనివాస్

​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 05:42 PM
197 వీక్షణలు

న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

​దండేపల్లి మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

​దండేపల్లి:దండేపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు చేపట్టిన సమ్మెకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించిన వారు, వీఓఏల న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి, వెంటనే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ... వీఓఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారు చేస్తున్న సమ్మెకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. 

​వీఓఏల ప్రధాన డిమాండ్లు ఇవే:

​వీఓఏలకు నెలకు రూ. 20 వేల కనీస వేతనం ఇవ్వాలి.

​సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలి. 

​అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి.

​వీఓఏలకు రూ. 20 లక్షల సాధారణ మరియు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి.

​విధులకు అవసరమైన ట్యాబ్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి.

​58వ ప్రభుత్వ ఉత్తర్వును (జీవో 58) వెంటనే సవరించాలి. 

​ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, సమ్మె నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో వీఓఏలు పాల్గొన్నారు