BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 12 July 2026, 09:59 pm
Posted by : V శ్రీనివాస్

​ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం: గొర్ర తిరుపతి యాదవ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
12 Jul, 2026 - 09:59 PM
279 వీక్షణలు

మంచిర్యాల: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌ శ్రీమతి ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను యాదవ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సమితి రాష్ట్ర కార్యదర్శి గొర్ర తిరుపతి యాదవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ... ఒక మహిళను, సామాజిక వర్గాన్ని అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించి, పార్టీ క్రమశిక్షణ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

​అదేవిధంగా, ఎన్నికల సందర్భంగా గొల్ల–కురుమ–యాదవులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఆరోపణలు, హామీల అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే, యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత, రాజ్యాంగబద్ధమైన నిరసన కార్యక్రమాలను చేపడుతామని ఆయన హెచ్చరించారు