BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 11:23 AM
62 వీక్షణలు

మదనపల్లి: రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గురువారం మదనపల్లె కలెక్టరేట్లో అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి, ఇసుక స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాలని, బెల్ట్ షాపులను కఠినంగా నియంత్రించాలని ఆదేశించారు.

దీనిపై ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు స్పందిస్తూ.. ఇతర శాఖల సమన్వయంతో అక్రమార్కులపై ముమ్మర దాడులు నిర్వహిస్తామని, పదేపదే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని మంత్రికి స్పష్టం చేశారు. బార్లు, మద్యం దుకాణాల వద్ద గొడవలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా పెంచినట్లు తెలిపారు.

మద్యం విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ అధికారులకు సూచించగా, దుకాణాల పరిసరాల్లో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు కోరారు.