పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులంతా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- ఎల్బీనగర్‌లో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎల్బీనగర్, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్:
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పి అండ్ టీ కాలనీ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్‌తో పాటు సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, శైలజ, కొత్త రవీందర్ రెడ్డి, సుధీర్ గౌడ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.