BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 09:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: ఏపీలో రేషన్‌ విధానంలో కొత్త మార్పులు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:15 AM
74 వీక్షణలు

అమరావతి: ఏపీలో రేషన్‌ విధానంలో కొత్త మార్పులు.. బియ్యం తీసుకోని వారికి డిజిటల్‌ రూపంలో నగదు బదిలీ?

ఆంధ్రప్రదేశ్‌లో సీబీడీసీ (సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ) విధానం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్‌ కార్డులు కలిగిన వారికి, ముఖ్యంగా రేషన్‌ బియ్యం తీసుకోని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా నగదు బదిలీ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, అదే తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధికారులు ఇటీవల గుజరాత్‌ వెళ్లి అక్కడ సీబీడీసీ అమలు విధానం, సాంకేతిక ప్రక్రియలను అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

తొలి దశలో విశాఖపట్నంలో సీబీడీసీ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రయోగాత్మక అమలు ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.

సీబీడీసీ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక, నగదు బదిలీ విధానం తదితర అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే రేషన్‌ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు బియ్యం అవసరం లేని వారికి ప్రత్యామ్నాయ ప్రయోజనం అందించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.