BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:22 AM
52 వీక్షణలు

సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి : రాష్ట్రంలో వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. సాగునీటి రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

హంద్రీనీవా ప్రాజెక్టుపై గత 16 నెలల్లో రూ.3,500 కోట్లు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు అందించే చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు గతంలోనే వేగంగా కొనసాగి ఉంటే ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.