BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 28 August 2026, 09:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:21 AM
94 వీక్షణలు

అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత అప్పిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ నేత అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. తుది ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికాకముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణపై ఆసక్తి నెలకొంది.