BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:17 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్చి నాటికి గోదావరి పుష్కరాల పనులు పూర్తి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:17 AM
48 వీక్షణలు

మార్చి నాటికి గోదావరి పుష్కరాల పనులు పూర్తి : ఎంపీ పురంధేశ్వరి

రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను సెప్టెంబర్ నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

రాజమహేంద్రవరం నగరంలో 26 ప్రధాన రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధి, రాకపోకల సౌకర్యాల మెరుగుదలకు ఈ పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

అలాగే బుట్టాయిగూడెం–కొవ్వూరు జాతీయ రహదారి నిర్మాణానికి రూ.840 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పంపించే నిధుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందనే విశ్వాసం ఉందన్నారు.

గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు.