BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు సీఎం చంద్రబాబు....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:26 AM
60 వీక్షణలు

మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు సీఎం చంద్రబాబు.. సీనియర్ నేతలతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు (ఆగస్టు 28) మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు.

కార్యాలయానికి చేరుకున్న అనంతరం పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ–ప్రభుత్వ సమన్వయం తదితర కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష చేయడం వంటి అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

సీఎం పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పార్టీ కార్యకర్తలు, ప్రజలను కలిసి వారి సమస్యలపై వినతులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.