BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 04 September 2026, 05:39 pm
Posted by : DAVU RAVINDER REDDY

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
04 Sep, 2026 - 05:39 PM
7 వీక్షణలు

అనుమానాస్పద స్థితిలో  మహిళ మృతదేహం

ఎన్ టుడే న్యూస్, ఘట్కేసర్:  పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. యంనంపేట శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలోని చెట్ల పొదల్లో మహిళ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన వెదజల్లుతుండగా గమనించిన యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండొచ్చని, వారం రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మహిళ హత్యకు గురైందా ? లేక ఇతర కారణాలతో మృతి చెందిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.