BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 13 February 2026, 10:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు.

తెలంగాణ
13 Feb, 2026 - 10:12 AM
400 వీక్షణలు
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. NTODAY NEWS : పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవాగడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆదివారం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు బి. బాలాజీ మాట్లాడుతూ, పుంగనూరు పరిధిలోని 8 తాండాలు మరియు సమీప మండలాల బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల ముఖ్య కార్యక్రమాల్లో భాగంగా భోగ్ బండార్ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సుగాలిమిట్ట సేవాగడ్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి, పుంగనూరులోని కొత్త ఇండ్లు, అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మూడేప్ప సర్కిల్ మార్గంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, పాలాభిషేకం చేయనున్నారు. ర్యాలీ అనంతరం సేవాగడ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవాలాల్ భక్తి గీతాలు నిర్వహించనున్నారు. రాత్రి మరోసారి అన్నదానం చేసి, జాగారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలకు బంజారా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఎం. రెడ్డి నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. నాగరాజ నాయక్, వైస్ ప్రెసిడెంట్ ఎం. శ్రీరాములు నాయక్, ట్రెజరర్ బి. గోపాల్ నాయక్ తదితర కమిటీ సభ్యులు మరియు 8 తాండాల పెద్దలు పాల్గొననున్నారు. #SantSevalalMaharaj #SevalalJayanti #BanjaraCommunity #Punganur #AnnamayyaDistrict #CulturalCelebrations Follow us on Website Facebook Instagram YouTube