BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 22 January 2026, 09:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన

తెలంగాణ
22 Jan, 2026 - 09:15 AM
400 వీక్షణలు
నో హెల్మెట్ – నో పెట్రోల్ పై అవగాహన కార్యక్రమం NTODAY NEWS : నార్కెట్‌పల్లి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు “నో హెల్మెట్ – నో పెట్రోల్” అంశంపై నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్కెట్‌పల్లి పరిధిలోని వివిధ పెట్రోల్ బంకులను పోలీసులు సందర్శించి, హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయవద్దని బంకు యజమానులు, సిబ్బందికి స్పష్టంగా సూచించారు. హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ అందించాలని తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి ఎస్సై విష్ణు మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని, రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. చట్టాన్ని గౌరవిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం పెరుగుతుందని, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నార్కెట్‌పల్లి పోలీస్ సిబ్బంది, పెట్రోల్ బంకు యజమానులు, బంకు కార్మికులు, వాహనదారులు పాల్గొన్నారు. #NoHelmetNoPetrol #RoadSafety #HelmetAwareness #TrafficRules #SaveLives #Narketpally #TelanganaPolice #RoadAccidentPrevention Follow us on Website Facebook Instagram YouTube