BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 January 2026, 08:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం

తెలంగాణ
18 Jan, 2026 - 08:13 AM
403 వీక్షణలు
[caption id="attachment_4755" align="alignnone" width="640"] Ayyappa Swamy Mahaprasadam distribution program[/caption] అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమం NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ దేవి ఆలయంలో అయ్యప్ప స్వామి మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ముందుగా కనకదుర్గ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి మకర జ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ మహాప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్నతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. #AyyappaSwamy #AyyappaDeeksha #Mahaprasadam #MakaraJyothi #Chityala #NalgondaDistrict #SpiritualEvent #ArtOfLiving #DevotionalProgram #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube