BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 19 April 2026, 06:16 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
19 Apr, 2026 - 06:16 AM
151 వీక్షణలు

బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం: రూ. 5.40 లక్షల పరిహారం అందజేసిన మంత్రి అడ్లూరి

​ధర్మపురి/వెల్గటూర్:

ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మపురి మరియు వెల్గటూర్ మండలాల్లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.

​రాయపట్నంలో రూ. 5 లక్షల చెక్కు పంపిణీ

​ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య మూడేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మరణించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును చిన్నయ్య భార్య గటిక అమ్మాయికి రాయపట్నం గ్రామ పంచాయతీ వద్ద మంత్రి అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం కొంతైనా ఆసరాగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

​కోటిలింగాల రైతుకు రూ. 40 వేల పరిహారం

​అలాగే వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన రైతు రాపాక మహేందర్ కు చెందిన గేదె విద్యుత్ షాక్‌తో మరణించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం రైతుకు జరిగిన నష్టానికి గాను రూ. 40 వేల పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ చెక్కును కూడా మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతుకు అందజేశారు.

​పాల్గొన్న ముఖ్య నేతలు:

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.