బీజేపీ కొడంగల్ ఇన్‌చార్జీ టీఆర్ఎస్‌లో చేరిక బంజారాహిల్స్‌లో బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లోకి కొడంగల్ ఇన్‌చార్జీ
తెలంగాణ
/
హైదరాబాద్
అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రభాకర్ కులకర్ణి
బంజారాహిల్స్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ ప్రభాకర్ కులకర్ణి తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ కులకర్ణి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బహుజన తెలంగాణ సాధన కోసం తెలంగాణ రక్షణ సేనలో చేరినట్లు తెలిపారు. బహుజనుల హక్కులు, సంక్షేమం కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అర్చనా సేనాపతి, గవినోళ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.