BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 07:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 07:56 AM
178 వీక్షణలు

బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు – చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణ

ఏలూరు జిల్లా ఎలూరు జిల్లాలోని చాట్రాయి మండలంలో ఎస్‌ఐ డి. రామకృష్ణ ఒక ప్రకటనలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా కీలక హెచ్చరిక జారీ చేశారు.

క్రికెట్‌ను కేవలం ఒక క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ అనే ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో “#SayNoToBettingApps” ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా బెట్టింగ్ దందా కొత్త రూపంలో కొనసాగుతోందని ఆయన తెలిపారు.

డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో జరిగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.

బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ఇక నూజివీడు నియోజకవర్గ పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామని కూడా అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.