షైనింగ్ స్టార్ అవార్డు గ్రహీత విద్యార్ధి సుబహాన్ కి అభినందనలు తెలిపిన సిఐ. సుబ్బారాయుడు..
షైనింగ్ స్టార్ అవార్డు గ్రహీత విద్యార్ధి సుబహాన్ కి అభినందనలు తెలిపిన సిఐ. సుబ్బారాయుడు..
అన్నమయ్య జిల్లా..పుంగనూరు
అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణం గాంధీనగర్ చెందిన యస్.అల్లాబక్ష కుమారుడు యస్.యం.డి సుబహాన్ కు నిన్న సోమవారం జిల్లా కేంద్రము మదనపల్లెలో జరిగిన కార్యక్రమములో జిల్లా కలెక్టర్ మరియు ఎం.ఎల్.ఏ షాజహాన్ బాషా,డీ ఈ ఓ సుబ్రహణ్యం, మంత్రి బి సి.జనార్ధన్ గారి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థికి 20 వేల ప్రోత్సాహక నగదుతో పాటు, ప్రశంసా పత్రం, మెడల్ ను బహుకరిచారు. ఇటీవల జరిగిన 10 వ తరగతి పరీక్షల్లో భాష్యం పాఠశాలలో చదివిన మొహమ్మద్ సుబహాన్ జిల్లా స్థాయిలో 589 మార్కులు సాధించడంతో ప్రభుత్వం సుబహాన్ షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక చేసింది.అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన తాలిమే హునర్ టాలెంట్ టెస్టులో పాల్గోని రాష్ట్రస్థాయిలో 45వ ర్యాంకు సాధించి చిత్తూరు జిల్లాలో ఏకైక విద్యార్థిగా నిలిచారు.ఈ సందర్భంగా రాజాం పేట పార్లమెంట్ సెకరేట్రీ పర్వీన్ తాజ్ టిడిపి నాయకులు షామీర్, ఇబ్రహీం, నూరుల్లా, తదితరులు సిఐ సుబ్బారాయుడు,ఎస్సైలు రమణ,ఆన్సర్ ల ఆధ్వర్యంలో అవార్డు గ్రహీత సుబహాన్ ను అభినందించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రత్యేక శ్రద్ద వహించి ప్రతిభ ని చూపడం హర్షించదగ్గ విషయం అని మంచి నడవడిక తో విద్య పట్ల ఏకగ్రత తో విద్యార్థులు ఇంకా ఉన్నత స్థాయి లో ఉత్తిర్ణత సాధించి గుర్తింపు పొందాలన్నారు.
భవిష్యత్తులో ఐ.ఏ.యస్ కావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.ఈ సందర్భంగా పట్టణం లోని ప్రముఖులు ఉపాధ్యాయులు సుబహాన్ ను అభినందించి, భవిష్యత్తులో అతను మరెన్నో విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని ఆకాంక్షించారు.