BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 09:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగన్‌తో పొగాకు రైతుల భేటీలో పాల్గొన్న కాకాణి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 09:32 PM
66 వీక్షణలు

జగన్‌తో పొగాకు రైతుల భేటీలో పాల్గొన్న కాకాణి

తాడేపల్లి, జూలై 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వివిధ జిల్లాలకు చెందిన పొగాకు రైతులు బుధవారం తాడేపల్లిలో సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సమావేశంలో రైతులు పొగాకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, ధరల సంక్షోభం, వేలం ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వేలం ప్రారంభమై 94 రోజులు గడిచినా కొనుగోళ్లు పూర్తికాలేదని, సాధారణంగా జూలై నాటికి ముగియాల్సిన అమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని సరుకు పూర్తిగా అమ్ముడుపోకముందే మైసూరులో వేలాలు ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోతారని, దీంతో రాష్ట్ర రైతులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.

కొన్ని వేలం కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం వరకు 'నో బిడ్‌లు', తిరస్కరణలు నమోదవుతున్నాయని రైతులు వెల్లడించారు. తిరస్కరించిన ఒక్కో బేలును మళ్లీ వేలానికి తీసుకురావడానికి కనీసం రూ.1,000 అదనపు ఖర్చు అవుతోందని, ఒక్కో బ్యారన్‌పై రూ.5 లక్షల వరకు నష్టం వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమనే దుస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాంతానికి చెందిన ఒక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు.

ఏలూరు, గోదావరి జిల్లాలకు చెందిన రైతులు మాట్లాడుతూ, 80 నుంచి 85 మిలియన్ కిలోల పంటలో ఇప్పటివరకు కేవలం 7 మిలియన్ కిలోలే కొనుగోలు జరిగిందని తెలిపారు. సాగు సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయాలని ప్రోత్సహించిన కంపెనీలు, వేలం సమయంలో సిండికేట్‌గా మారి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను కాపాడకుండా వ్యాపార వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రైతుల కథనం ప్రకారం, కిలోకు రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ వ్యాపారులు ఆ ధరను అమలు చేయలేదని తెలిపారు. తమ ఆందోళనలను అణచివేయడానికి పోలీసులతో కేసులు నమోదు చేయిస్తున్నారని కందుకూరు ప్రాంత రైతులు ఆరోపించారు.

జగన్ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్ జోక్యంతో కొనుగోళ్లలో పోటీ ఏర్పడి రైతులకు మెరుగైన ధరలు లభించాయని రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పొగాకునే పూర్తిగా కొనుగోలు చేయకుండా వచ్చే ఏడాదికి ఇండెంట్‌లు ఇవ్వడం సమంజసం కాదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై జగన్ పోరాటం చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం తమకు ఉందని రైతులు సమావేశంలో పేర్కొన్నారు.