BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 07:00 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మున్సిపల్‌ ఎన్నికల్లో ఇక ఈవీఎంలే

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Sep, 2026 - 07:00 AM
16 వీక్షణలు

ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం

పుంగనూరు | Ntoday News

రాష్ట్రంలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో 211 జారీ చేసినట్లు సమాచారం.

నామినేషన్‌ డిపాజిట్‌ ఇలా..

నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులకు డిపాజిట్‌ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500గా డిపాజిట్‌ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు.

అభ్యర్థులు తమ నామినేషన్‌తో పాటు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్‌ను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగం, నామినేషన్‌ నిబంధనల ఖరారుతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ మరింత స్పష్టత పొందింది.