BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 September 2026, 06:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక కసరత్తు.. 2, 3 రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Sep, 2026 - 06:45 AM
24 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కీలక ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో రెండు, మూడు రోజుల్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అన్ని కేటగిరీలకు దరఖాస్తుల స్వీకరణ

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కేటగిరీల పింఛన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తుల స్వీకరణ విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మంత్రి, సెర్ప్ అధికారుల చర్చ

పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ఏయే కేటగిరీలకు ఎలా స్వీకరించాలనే అంశంపై గురువారం రాత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ అధికారులు చర్చించారు. అనంతరం ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు సమాచారం.

సీఎం ఆమోదం తర్వాత నిర్ణయం

ఈ అంశాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆమోదం పొందిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఒకేసారి ఇస్తారా.. దశల వారీగా?

కొత్త పింఛన్లకు వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అర్హులైన అందరికీ ఒకేసారి పింఛన్లు మంజూరు చేయాలా? లేక దశల వారీగా పింఛన్లు మంజూరు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మొత్తంగా.. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం ఆమోదం అనంతరం దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.