BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 09:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

TGREDCO డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 09:31 PM
140 వీక్షణలు

TGREDCO డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న టీజీఆర్‌ఈడీసీఓ (TGREDCO) డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు. మాదాపూర్ నివాసంతో పాటు రాష్ట్రంలోని మరో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

అధికారిక సమాచారం ప్రకారం, ముత్యం వెంకటరమణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ దాడులు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లు, పెట్టుబడుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాల విలువ, అక్రమాస్తుల వివరాలను లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా, ముత్యం వెంకటరమణ గతంలో 2019లో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో డీఈగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో కూడా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీ మొత్తంలో అక్రమాస్తులను గుర్తించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కొనసాగుతున్న సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసిన ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.