బిసి బాలుర వసతి గృహనికి ఫ్యాన్లు
బిసి బాలుర వసతి గృహనికి. ఫ్యాన్లు బహుకరిoచిన వార్డు సభ్యులు మట్టిపల్లి సుగుణ నాగరాజు
నల్గొండ. జిల్లా. చిట్యాల. మండలం. ఉరుమడ్ల. గ్రామం
ఊరుమడ్ల గ్రామం లోని బిసి బాలుర వసతి గృహనికి.ఫ్యాన్లు బహుకరిoచిన వార్డు సభ్యులు మట్టిపల్లి సుగుణనాగరాజు
శుక్రవారం ఉరుమడ్ల గ్రామంలోని బిసి బాలుర వసతి గృహ విద్యార్థులు రాత్రి వేళలో దోమల వల్ల ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి వార్డు సభ్యులు మట్టిపల్లి సుగుణ నాగరాజు రెండు ఫ్యాన్లు ఉచితంగా అందచేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు వసతి గృహా సంక్షేమ అధికారి, విద్యార్థులు వారి యొక్క సేవాభావాన్ని అభినందిస్తూ శాలువతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు దాతలు ముందుకు వచ్చి వారిలో వార్డు సభ్యులు గంగాపురం రాము ఒక ఫ్యాను, బోయ సుస్మిత సైదులు రెండు ఫ్యాన్లు, సాగర్ల వెంకన్న రెండు ఫ్యాన్లు, ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి ఒక ఫ్యాన్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షo, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, చిట్యాల మండల సోషల్ మీడియా ఇంచార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము, ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి, బోయ సుష్మిత సైదులు, వసతి గృహా సంక్షేమ అధికారి కె ప్రసాద్,నాయకులు సాగర్ల వెంకన్న,బెలిజ పరమేష్,మందుగుల జయవర్ధన్,బెల్జ మహేష్,జిట్టగోని వెంకన్న,ఆవిశెట్టి మల్లేష్,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మన గ్రామంలోని యువకులు మరియు గ్రామస్తులు పెద్దలు పాలకవర్గం సంబంధించినటువంటి వారు అందరు కూడా విద్యార్థుల కోసం వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో తమదైనటువంటి పాత్రను పోషిస్తూ మీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని తెలిపారు.