BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 09 August 2026, 05:01 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
09 Aug, 2026 - 05:01 PM
222 వీక్షణలు

బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి


బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు


మంచిర్యాల నియోజకవర్గం:

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ఆదిపరాశక్తి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న సురేఖమ్మ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఆదిపరాశక్తి అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు.


భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.


ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ, “ఆదిపరాశక్తి అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆనందం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.


ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.