BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రంజాన్ ఎఫెక్ట్… ఎస్‌ఎస్‌సి పరీక్ష షాక్ మార్పు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 06:40 AM
133 వీక్షణలు

రంజాన్ ఎఫెక్ట్… ఎస్‌ఎస్‌సి పరీక్ష షాక్ మార్పు!  21న ఉండాల్సిన ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

విజయవాడ, మార్చి 20: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా 21-03-2026న ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో, అదే రోజు నిర్వహించాల్సిన ఎస్‌ఎస్‌సి 3వ భాష ఇంగ్లీష్ పరీక్ష (పేపర్ కోడ్‌లు 13E & 14E)ను అకస్మాత్తుగా వాయిదా వేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొనకుండా ఉండేందుకు అధికారులు వెంటనే స్పష్టత ఇచ్చారు. వాయిదా పడిన ఈ పరీక్షను 02-04-2026 (గురువారం) ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది.

జిల్లా విద్యాశాఖాధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ కాగా, ఈ మార్పును గ్రామ స్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు సహా అందరికీ సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా, ఏప్రిల్ 2న పరీక్ష నిర్వహణలో ఎలాంటి అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల సిద్ధత, సిబ్బంది నియామకం, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇక 21-03-2026న విధులకు నియమించబడిన ఇన్విజిలేటర్లు, అదే విధంగా 02-04-2026న కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.