BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 19 June 2026, 06:59 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

భాష్యం విద్యాసంస్థలో పుస్తకాలు,యూనిఫాం అమ్ముతున్న రూమ్ సీజ్ – అక్రమ ఫీజుల వసూళ్లపై కఠిన చర్యలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 06:59 PM
109 వీక్షణలు

భాష్యం విద్యాసంస్థలో పుస్తకాలు,యూనిఫాం అమ్ముతున్న రూమ్  సీజ్ – అక్రమ ఫీజుల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి : మున్నా AISF రాష్ట్ర సమితి సభ్యులు 

పుంగనూరులోని భాష్యం విద్యాసంస్థలు విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు తదితర వస్తువులను కిట్ రూపంలో బలవంతంగా అందిస్తూ రూ.10,500 వరకు అధిక మొత్తాలను వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సంస్థను సీజ్ చేయడం అభినందనీయమని AISF రాష్ట్ర సమితి సభ్యులు మున్నా    పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అక్రమ ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకునేలా కృషి చేసిన AISF రాష్ట్ర సమితి సభ్యుడు మున్నా, బీసీవై పార్టీ నాయకులు సురేష్ యాదవ్, విక్రమ్ యాదవ్, అలాగే  పాల్గొని భాష్యం విద్యాసంస్థను సీజ్ చేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ, విద్యను వ్యాపారంగా మార్చి అక్రమంగా ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్న అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థల అనుమతులను రద్దు చేయాలని కోరారు.

అలాగే విద్యాహక్కు చట్టం–2009 రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్య సేవగా ఉండాలే గానీ వ్యాపారంగా మారకూడదని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నిరంతరం పోరాడుతుందని వెంకట్ యాదవ్ తెలిపారు.

ఇట్లు,

 మున్నా

AISF రాష్ట్ర సమితి సభ్యులు