BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 17 August 2026, 06:37 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మండలం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Aug, 2026 - 06:37 PM
600 వీక్షణలు

చిట్యాల మండలం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ  కార్యక్రమంలో భాగంగా 95-నకిరేకల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం చిట్యాల తహసిల్దార్ విజయ్ కుమార్ విడుదల చేశారు. మండలంలోని మొత్తం 55 పోలింగ్‌ కేంద్రాల్లో సంబంధిత బూత్‌ లెవెల్‌ అధికారులు  జాబితాను ప్రచురించారు. చిట్యాల మండలంలో మొత్తం 44,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 22,256 మంది పురుషులు, 22,513 మంది మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నట్లు తహశీల్దారు తెలిపారు. ఓటర్లు తమ పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేదో సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో, బి ఎల్ ఓల వద్ద లేదా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. అర్హత ఉన్న వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారమ్‌-6, ఓటరు పేరు తొలగింపునకు ఫారమ్‌-7, ఓటరు వివరాల్లో మార్పులు, చిరునామా మార్పు, ఫొటో తదితర సవరణల కోసం ఫారమ్‌-8 సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత బి.ఎల్.ఓలకు లకు, ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ల ద్వారా  ఏ ఈ ఆర్ ఓ, ఈఆర్ఓ  అధికారులకు సమర్పించవచ్చని చిట్యాల తహశీల్దారు విజయ్ కుమార్ పేర్కొన్నారు.