BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

భక్తిశ్రద్ధలతో అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
02 Apr, 2026 - 04:28 PM
108 వీక్షణలు

భక్తిశ్రద్ధలతో 'అంజన్న' సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​• రాఘవపట్నంలో కళ్యాణ మండపం ప్రారంభం

• గంగాదేవిపల్లి పంచాయతీ భవనానికి శంకుస్థాపన

• మహిళల కోరిక మేరకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశం

​గొల్లపల్లి, ఏప్రిల్ 02:

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

​గుండు హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు

​రాఘవపట్నం గ్రామంలోని ప్రసిద్ధ గుండు హనుమాన్ దేవాలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ ఆవరణలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఆధ్యాత్మికతతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

​అభివృద్ధి పనులకు శంకుస్థాపన

​అనంతరం గంగాదేవిపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి, రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామస్థులకు పాలనను మరింత చేరువ చేసేందుకే నూతన భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

​మహిళల విజ్ఞప్తిపై తక్షణ స్పందన

​గంగాదేవిపల్లి పర్యటనలో భాగంగా స్థానిక మహిళలు తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అక్కడికక్కడే జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు, మహిళల సౌకర్యార్థం గ్రామానికి వెంటనే బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని ఆదేశించారు. మంత్రి తక్షణ నిర్ణయం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.