BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భూమిలో అక్రమంగా రహదారి వేసి అడ్డుకుంటున్నారని రైతు కుటుంబం ఆరోపణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
140 వీక్షణలు

అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పోలవరపు రమాదేవి, భర్త దయాకరరావు తమ వ్యవసాయ భూమిలో అక్రమంగా రహదారి నిర్మించి, దానిని తొలగించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, యల్లాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు 2 ఎకరాల 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉందని, అందులో పామాయిల్ తోట సాగు చేస్తున్నామని తెలిపారు. తమ భూమి సరిహద్దులో ఉన్న ఇరిగేషన్ కాలువపై కొందరు రైతులు పైపులు వేసి, అనుమతి లేకుండా భూమిలోకి రహదారి ఏర్పాటు చేశారని ఆరోపించారు.

ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం శుక్రవారం జేసీబీ సహాయంతో ఆ రహదారిని తొలగించి గట్టు నిర్మించే పనులు చేపట్టగా, మల్లినేని మురళీ, మూతినేని ప్రభాకర్, మూతినేని కిషోర్‌తో పాటు పక్క తోట కౌలు రైతు కలిసి పనులను అడ్డుకున్నారని తెలిపారు. జేసీబీకి నష్టం కలిగించడంతో పాటు సామాన్లు దొంగిలించారని, వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

తమ భూమిలో పనులు నిలిపివేయడమే కాకుండా ప్రశ్నించినందుకు దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు పాల్పడ్డారని, తల్లిని నెట్టివేసి ఇబ్బందులకు గురిచేశారని బాధితులు వాపోయారు.

ఈ ఘటనపై రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు వెంటనే స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.

వ్యక్తిగత భూమిలో అక్రమ రహదారి ఏర్పాటు, తొలగింపు పనులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఈ ఘటన ముసునూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.