BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 06 February 2026, 06:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ నేత డిమాండ్

తెలంగాణ
06 Feb, 2026 - 06:36 AM
208 వీక్షణలు
తిరుమల లడ్డూ వ్యవహారంపై బీజేపీ నేత వ్యాఖ్యలు – మాజీ సీఎం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ NTODAY NEWS: గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి  తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమిలో భాగంగా ఈ అంశంపై ఖండన కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అత్యంత పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, అలాంటి ప్రసాదంపై ఈ తరహా ఆరోపణలు రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిందని పేర్కొంటూ, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ అంశంపై బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా, ఆయన పాలనలోనే జరిగిందని చెబుతూ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తిగా హుందాగా స్పందించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చిట్టా మధు కోరారు. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం పై ప్రస్తుతం రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై సంబంధిత అధికారిక సంస్థల నుంచి స్పష్టమైన నివేదికలు రావాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ఇతర పార్టీల స్పందన ఇంకా రావాల్సి ఉంది. #Ntodaynews, #Tirumala Laddu, #BJP, #Chitta Madhu, #YSRCP, #Jagan Mohan Reddy, #Political News, #Andhra Pradesh Follow us on Website Facebook Instagram YouTube