BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 03 December 2025, 08:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన

తెలంగాణ
03 Dec, 2025 - 08:18 AM
252 వీక్షణలు

ముఖ్యమంత్రి హిందూ దేవతలపై చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ... బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ నిరసన

NTODAY NEWS: ఎల్బీనగర్  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవీ–దేవతలు, హిందూ సమాజంపై చేసిన అవమానకర వ్యాఖ్యలు, వ్యంగ్య భాష హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఖండించారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపుమేరకు ఈ హిందూ ద్వేషపూరిత ధోరణికి నిరసనగా, బుధవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కమలానగర్ చౌరస్తా వద్ద బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు . సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్.అంటూ తీవ్రంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలను సరూర్నగర్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకుని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. హిందూ ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు, హిందూ సమాజాన్ని చేసే చర్యలపై బీజేపీగా ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగిస్తామని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి, మురళి, చిలకూరి మధుసూదన్ రెడ్డి, బాబు చౌదరి, రాజు, సిరి రెడ్డి, అమంచి శ్రీనివాస్, సిద్దు, వంశీ యాదవ్, టీంకు మరియు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube