BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 29 January 2026, 08:17 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

తెలంగాణ
29 Jan, 2026 - 08:17 AM
203 వీక్షణలు
సుందరయ్య భవన్‌లో తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ NTODAY NEWS:  భువనగిరి పట్టణం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో గురువారం తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, గొరిగి సోములు మాట్లాడుతూ— దేశంలో కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ, కార్మికులను కేవలం చాకిరీకి పరిమితం చేసే విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును హరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న వలస కార్మికుల చట్టాలు, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేసే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య, భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాధారం మల్లేశం, నాయకులు వెంకటేశం, ఈశ్వరయ్య, మారయ్య, రాధాకృష్ణ, ఎల్లా స్వామి, ప్రసాద్, ఎస్.కే. శీను తదితరులు పాల్గొన్నారు. #WorkersUnion #ConstructionWorkers #LabourRights #TradeUnion #CITU #WorkersWelfare #Bhongir Follow us on Website Facebook Instagram YouTube