BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 06 November 2025, 11:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పెట్టుబడిదారీ విధానం - భవిష్యత్ ?

తెలంగాణ
06 Nov, 2025 - 11:12 AM
321 వీక్షణలు
సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా... NTODAY NEWS: గుంటూరు పెట్టుబడిదారీ విధానం - భవిష్యత్ ? - తేది :07-11-2025, శుక్రవారం సా॥ 4 గం॥లకు వేదిక : శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, మార్కెట్ సెంటర్, గుంటూరు. ప్రధాన వక్త : కామ్రేడ్ బి.వి. రాఘవులు, సిపిఐ (యం) పొలిట్యూరో సభ్యులు వక్తలు : కామ్రేడ్ సిహెచ్ బాబురావు, సిపియం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీ కె.యస్. లక్ష్మణరావు, శాసనమండలి మాజీ సభ్యులు కామ్రేడ్ వై. నేతాజి, సిపియం జిల్లా కార్యదర్శి ప్రజలారా ! సోవియట్ యూనియన్లో 1917 నవంబర్ 7వ తేదీన జరిగిన విప్లవోద్యమం పర్యవసానంగా ప్రపంచంలో మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం అధికారంలోకి వచ్చింది. కార్మిక వర్గానికి 8 గంటల పని దినం, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, అందరికీ పని, గృహ వసతి, వృద్ధాప్యంలో ప్రజలకు భరోసా, రైతాంగానికి వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం, సాంస్కృతికంగా వివిధ నైపుణ్యాలు గల ప్రజలకు ఆయా రంగాలలో అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు తదితర అనేక సౌకర్యాలు విప్లవం ఫలితంగా సోవియట్ యూనియన్ ప్రజలకు సమకూరాయి. మహిళలకు సమాన హక్కులు లభించాయి. మైనారిటీ జాతుల పట్ల వివక్ష రూపుమాపి దేశ ప్రజలందరినీ సమానంగా పరిగణించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలను అగ్రరాజ్యాలతో ధీటుగా అభివృద్ధి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండు కోట్ల మంది ప్రజల ప్రాణాలను త్యాగం చేసి ప్రపంచ ప్రజలను ఫాసిజం ప్రమాదం నుండి రక్షించారు. ప్రపంచంలోని వలస దేశాల విముక్తి పోరాటాలకు అండగా నిలిచారు. కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాల స్వయం అభివృద్ధికి సోవియట్ విప్లవం తోడ్పాటును ఇచ్చింది. 1990లో సోవియట్ యూనియన్ లో సోషలిజం ఎదురు దెబ్బల తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదన్న ప్రచారం భారీ ఎత్తున జరిగింది. 35 ఏళ్ల అనంతరం పరిశీలిస్తే నేడు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజా సమస్యలను పరిష్కరించలేని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లోని యువత, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాలలో సరళీకరణ విధానాలను వ్యతిరేకించే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. భారతదేశంలోనూ ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, వ్యవసాయ సంక్షోభం, తీవ్ర అసమానతలు, మహిళలపై అఘాయిత్యాలు, కులవివక్ష తదితర అనేక సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా 2025 నవంబర్ 7వ తేది శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ సభలో అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము... సభ ప్రారంభంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస (మార్క్సిస్టు), గుంటూరు జిల్లా కమిటీ.   Follow us on Website Facebook Instagram YouTube