వనపర్తిలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
తెలంగాణ
/
మహబూబ్ నగర్
ప్రారంభించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి
వనపర్తి | ఎన్ టుడే న్యూస్:
వనపర్తి జిల్లా నాగవరం శివారులో కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ నిధి గుప్తాను కలిసి పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయంలో అందించే విద్యా సదుపాయాలు, ప్రవేశాల విధానం గురించి ప్రిన్సిపాల్ వివరించారు.