BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 April 2026, 05:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 05:04 PM
473 వీక్షణలు

చాట్రాయి ఏఎస్సై వంగాల మాధవరెడ్డి కన్నుమూత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగాల మాధవరెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, కొంతకాలంగా చింతలపూడిలో నివాసం ఉంటూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారి‌గా మంచి పేరును సంపాదించారు.

ఆయన మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ, సిబ్బంది మాధవరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మాధవరెడ్డి మృతిపై స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.