BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 10:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండలంలో విద్యుత్‌ విజిలెన్స్‌ విస్తృత తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 10:36 AM
190 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు: చాట్రాయి మండలంలో ఏపీసీపీడీసీఎల్‌ విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విద్యుత్‌ వినియోగంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు విజిలెన్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లను, వాణిజ్య సంస్థలను, విద్యుత్‌ వినియోగ కేంద్రాలను తనిఖీ చేస్తూ అధికారులు వివరాలను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 40 బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ చౌర్యం, అక్రమ కనెక్షన్లు, మీటర్లలో అక్రమ మార్పులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్‌ను అక్రమంగా వినియోగించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ తనిఖీల కార్యక్రమంలో విజిలెన్స్‌ ఈఈ విజయకుమారి, నూజివీడు ఈఈ రాజమోహన్‌రావు, విస్సన్నపేట ఏడీఈ వీరబాబు, చాట్రాయి ఏఈ డి.సంజయ్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో బృందాలు తనిఖీలు నిర్వహించడంతో విద్యుత్‌ అక్రమ వినియోగదారుల్లో కలకలం నెలకొంది.