BREAKING
thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో
Date of Publish : 02 August 2026, 11:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ విజయాల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:30 PM
103 వీక్షణలు

చాట్రాయిలో ఇంటింటికి కూటమి ప్రభుత్వ విజయాల ప్రచారం

చాట్రాయి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం" డోర్ టు డోర్ కార్యక్రమం ఆదివారం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లిన నాయకులు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.

మందపాటి బసవా రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డం ప్రభాకర్ రెడ్డి, బూత్ ఇంచార్జ్‌లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపిస్తోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు.

గత ప్రభుత్వంలో మహిళలకు తగిన ప్రాధాన్యం లభించలేదని, ప్రస్తుత ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రజా సంక్షేమ పాలన నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు