BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 10:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో టీడీపీ దళిత నాయకుల ఆత్మీయ కలయిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 10:07 PM
265 వీక్షణలు

దళిత హక్కులు, రాజకీయ ప్రాధాన్యతపై విస్తృత చర్చ

ఏలూరు జిల్లా, చాట్రాయి:

చాట్రాయి మండలంలో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. గడ్డం రమేష్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న భవనంలో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గార్లపాటి మారేష్, నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యం వహించారు.

నూజివీడు నియోజకవర్గ పరిధిలోని దళిత నాయకులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు వంద మంది దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళితుల న్యాయపరమైన హక్కులు, ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య రంగాల్లో వారికి అందాల్సిన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రామాల అభివృద్ధిలో దళిత నాయకుల పాత్రకు ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ కోసం కష్టపడుతున్న దళిత నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత అవకాశాలు కల్పించాలని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ప్రతి గ్రామంలో దళితుల ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన గుర్తింపు లభించడం లేదని నాయకులు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దళితులు ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దళితుల అభివృద్ధికి మంత్రి కొలుసు పార్థసారథి అనుకూలంగా పనిచేస్తున్నారని, దళితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్ రామ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి కొలుసు పార్థసారథిల సేవలను నాయకులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో దుర్గం పుల్లారావు, శేఖర్, కోట జోజి, కొమ్ము ప్రసాద్, మోదుగు ముత్తయ్య, కొమ్ము సృజన రావు, మోషే తదితర దళిత నాయకులు పాల్గొని ప్రసంగించారు.