BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 26 July 2026, 03:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 03:08 PM
85 వీక్షణలు

చాట్రాయి, జులై 26: రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతకుంట్ల వెంకటేశ్వరరావు సూచించారు.

ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల విస్తరణ కార్యక్రమంలో భాగంగా కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన రైతు నరసింగు చెన్నారావు పొలంలో పామాయిల్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీపై వివిధ ఉద్యానవన పంటలను సాగు చేసుకునే అవకాశం రైతులకు అందుబాటులో ఉందన్నారు.

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం అందించే పంటలపై ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు తీసుకుని రైతులు సాగు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ తారతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.