BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 26 July 2026, 01:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చదువు మానేసిన వారికి ఏపీఓపీఎస్‌ఎస్‌ ద్వారా మరో అవకాశం: ఓరియెంటేషన్ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jul, 2026 - 01:50 PM
55 వీక్షణలు

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, ధర్మాజీగూడెం: శ్రీ విద్య హైస్కూల్, శ్రీ చక్ర వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓపీఎస్‌ఎస్‌) సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఒకరోజు ఓరియెంటేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ప్రభుత్వ పరీక్షల శాఖ సహాయ కమిషనర్ ఆర్. ఆశ, మండల విద్యాశాఖ అధికారులు జే. రవీంద్ర, కే. దుర్గారావు హాజరై సార్వత్రిక విద్యాపీఠం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చదువు మధ్యలో మానేసిన వారికి ఏపీఓపీఎస్‌ఎస్‌ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ఒకే సంవత్సరంలో విద్యను పూర్తి చేసుకునే వీలు కల్పించడం ఈ విధానంలోని ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఏపీఓపీఎస్‌ఎస్‌ ద్వారా విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ సేవలను పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఏపీఓపీఎస్‌ఎస్‌కు సంబంధించిన బ్రోచర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చలసాని రత్నాకర్, కరస్పాండెంట్ సాయి సునంద, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.