BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 15 June 2026, 05:53 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 05:53 AM
109 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

30 లక్షల వ్యయంతో చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో పూర్తయిన ఆధునికీకరణ పనుల ప్రారంభోత్సవాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.

చింతలపూడి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్‌లో కల్పించిన సౌకర్యాలను ఎమ్మెల్యే పరిశీలించి, ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO), డిపో మేనేజర్, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.