BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 18 May 2026, 04:34 pm
Posted by : కూనురు మధు

చిట్యాల సబ్‌స్టేషన్‌లో ఘనంగా 327 యూనియన్ జెండా ఆవిష్కరణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 May, 2026 - 04:34 PM
253 వీక్షణలు

​కార్మికుల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్తాం

టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు సురేష్ కుమార్

కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడే ఏకైక వేదిక తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్  అని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. చిట్యాల మండల విద్యుత్ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఐఎన్‌టీయూసీ  327 ఆధ్వర్యంలో  జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ​చిట్యాల మండల అధ్యక్షులు పగుడాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా కంపెనీ అధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మిరెడ్డి మాట్లాడుతూ.విద్యుత్ శాఖలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్లు, స్పాట్ బిల్లింగ్ వర్కర్స్, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు 327 యూనియన్ నిరంతరం కొట్లాడుతుంది. ఆర్టిజన్లు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను వెంటనే  ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి (డిప్యూటీ సీఎం) మల్లు భట్టి విక్రమార్కల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తాం అని అన్నారు. ​విద్యుత్ కార్మికుల హక్కుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న 327 యూనియన్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ యూనియన్ సభ్యత్వాలను భారీగా పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ప్రతినిధులు అద్దెల నర్సిరెడ్డి, తిరుమలేష్, వెంకన్న, శరత్, సమ్మెటి వెంకన్న, గుండ్ల శీనయ్య, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సైదులు, బాలకృష్ణ, సాయి, నరేందర్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యుత్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు