BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 21 August 2026, 06:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చక్కెరకు చుక్కలు.. ధరలకు రెక్కలు రెండు రోజుల్లోనే కిలోపై రూ.6 వరకు పెరుగుదల

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 06:13 PM
65 వీక్షణలు

చక్కెరకు చుక్కలు.. ధరలకు రెక్కలు రెండు రోజుల్లోనే కిలోపై రూ.6 వరకు పెరుగుదల

ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు.. కొరత రాకుండా కసరత్తు

న్యూఢిల్లీ: దేశంలో చక్కెర ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. నిత్యావసర వస్తువుల్లో కీలకమైన చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. రెండు రోజుల్లోనే కిలో చక్కెర ధర సుమారు రూ.6 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  పండుగల సీజన్ సమీపిస్తుండటం, డిమాండ్ పెరగడం, సరఫరాపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. 

ధరల పెరుగుదలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిల్వలపై పరిమితులు విధించింది. వ్యాపారులు నిల్వల వివరాలను వెల్లడించేలా చర్యలు చేపట్టింది. 

మార్కెట్లో చక్కెర సరఫరా తగ్గకుండా ఉండేందుకు కేంద్రం దిగుమతుల మార్గాన్ని కూడా తెరిచింది. దేశీయ అవసరాలకు సరిపడా చక్కెర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చక్కెర ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. కేంద్ర చర్యలతో ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయన్నది వేచి చూడాల్సి ఉంది.