BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 02:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశంలో ఉల్లి కొరత లేదు.. కిలో రూ.35కే ఉల్లిపాయలు విక్రయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:36 PM
87 వీక్షణలు

సబ్సిడీ ధరలతో ఉల్లి అమ్మకాలు ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉల్లిపాయల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విక్రయాలను ప్రారంభించింది.

కిలో ఉల్లిని రూ.35కే అందుబాటులోకి తీసుకొచ్చింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపడుతున్నారు. తొలిదశలో ఢిల్లీలో మొబైల్ వ్యాన్ల ద్వారా 40 ప్రాంతాల్లో ఉల్లిని విక్రయిస్తున్నారు.

ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రేషన్ దుకాణాల ద్వారా కూడా ఉల్లిని అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్రం చర్చలు జరుపుతోంది. మార్కెట్‌లో ధరల నియంత్రణ, వినియోగదారులపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.