BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 23 July 2026, 05:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 05:44 PM
91 వీక్షణలు

చనుబండ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ పరిశీలన

చాట్రాయి మండలం చనుబండ ఉన్నత పాఠశాలలో పనిచేయకుండా ఉన్న ఆర్‌వో ప్లాంట్‌ను నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సురక్షితమైన మంచినీరు తాగడం ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు.

ఈ పరిశీలనలో చాట్రాయి ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఆర్‌వో ప్లాంట్ పనిచేయడం లేదని, ప్లాంట్‌ను సరఫరా చేసిన సంస్థ ప్రతినిధులకు మరమ్మతుల కోసం పలుమార్లు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు మెకానిక్ రాలేదని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

దీనిపై స్పందించిన ఇంచార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే మెకానిక్‌ను పంపించి ప్లాంట్‌ను మరమ్మతు చేయాలని ఆదేశించారు. దీనికి స్పందించిన సంస్థ ప్రతినిధులు త్వరితగతిన మెకానిక్‌ను పంపించి ఆర్‌వో ప్లాంట్‌ను మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.