BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 08:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ విద్యార్థుల ఘనత.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:34 PM
311 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చనుబండ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని గ్రామానికి, జిల్లాకు, తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచారు.

రెబ్బు గంగా వైష్ణవి, రెబ్బు ఉమా సాయి వీక్షిత్ తమ అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయి వేదికపై రికార్డులు సృష్టించారు. మే 31న ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ఈ అరుదైన ఘనతను సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ విజయానికి తిరువూరుకు చెందిన రేవంత్ డిఫెన్స్ స్కూల్ కీలక పాత్ర పోషించింది. నాలుగు సార్లు గిన్నిస్ రికార్డులు సాధించిన ప్రముఖ శిక్షకుడు మారకాల రేవంత్ పర్యవేక్షణలో విద్యార్థులు ప్రత్యేక శిక్షణ పొందారు. ఆయన అందించిన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు ప్రపంచ స్థాయి రికార్డులను నెలకొల్పగలిగారు.

హైదరాబాద్‌కు చెందిన విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ రికార్డు ప్రదర్శన నిర్వహించబడగా, విద్యార్థుల ప్రతిభను పరిశీలించి రికార్డును ధృవీకరించారు.

చిన్న గ్రామం నుంచి ప్రపంచ వేదికపై నిలిచిన ఈ ఇద్దరు విద్యార్థుల విజయంతో చనుబండ గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్ మారకాల రేవంత్‌ను అభినందిస్తున్నారు.

చనుబండ గ్రామ ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిన రెబ్బు గంగా వైష్ణవి, రెబ్బు ఉమా సాయి వీక్షిత్‌లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.